calender_icon.png 13 March, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ రేషన్‌కార్డులు

13-03-2025 12:39:45 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య 

చేవెళ్ల, మార్చి 12: అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. బుధవారం  చేవెళ్ల మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా దశలవారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.   ప్రతి గ్రామంలో ఎంతమంది అర్హులు ఉంటే అన్ని కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు మర్పల్లి కృష్ణారెడ్డి, బండారి ఆగిరెడ్డి, పడాల జనార్దన్, తహసీల్దార్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.