- గ్రామ సభల్లోనూ దరఖాస్తు తీసుకుంటాం
- రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
- వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, జనవరి 19: అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డు అందజేస్తామని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు రేషన్ కార్డు జారీకి సంబంధించి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు కార్డులు అందజేస్తామని కలెక్టర్ అన్నారు. గ్రామ సభల్లో, వార్డుల్లో, ప్రజాపా లన సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పిం చిన వాటిని పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రజాపాలన ఫారములతో పాటు ఇచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసు కుం టామని తెలిపారు. కుటుంబంలో విభజన అయినవారు కొత్త కార్డు కావాలని తీసుకు న్న దరఖాస్తును కూడా పరిశీలిస్తామ న్నారు.
గతంలో పెండింగ్ లో ఉన్న దర ఖాస్తులను కూడా పరిశీలిస్తామని అన్నారు. ఇదివరకు ఎప్పుడూ దరఖాస్తు సమర్పించక పోయినా గ్రామాలు, వార్డుల్లోకి వచ్చే అధికారులకు ప్రజలు తమ దరఖాస్తులు ఇవ్వాలని ఆయ న సూచించారు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుని ప్రజా పాలన ఆన్ లైన్ లో రాని వారు కూడా గ్రామ సభల్లో, ప్రజా పాలన సేవ కేంద్రాల్లో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.