calender_icon.png 19 January, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన ఆధారంగా రేషన్‌కార్డులు సరికాదు

19-01-2025 12:44:40 AM

  • అంతకుముందే ఆన్‌లైన్‌లో లక్షల దరఖాస్తులు
  • ఇప్పుడు ఆ అర్జీలన్నీ చెత్తబుట్టలోనేనా!
  • మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు రేషన్‌కార్డులు ఇవ్వకుండా కుట్ర చేస్తోందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కులగణన సర్వేను ఆధారంగా చేసుకొని రూపొందించిన జాబితానే గ్రామాలకు పం పారని, అంతకుముందే మీసేవా కేంద్రాల్లో కొన్ని లక్షలమంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వాటిని చెత్తబు ట్టలో వేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.

ప్రజాపాలనలో 11 లక్షల దరఖా స్తులను, మీసేవాలో వచ్చిన అర్జీలను ఎందు కు పరిశీలించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు శనివా రం మీడియాతో మాట్లాడారు. జనవ రి 26 నుంచి కొత్తగా పలు సంక్షేమ పథకా లు అమలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.. అమలు చేయడంకంటే ఎలా కోతలు పెట్టాలనే ఆలోచిస్తున్నట్లుందని విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదని, చివరి హామీ చేయూతకు దిక్కులేదన్నారు.

నిరుపేదలకు రేషన్ కార్డు లు రావాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం నాడు ఆదాయ పరిమితిని సడలించిందన్నారు. అభయహస్తం పేరుతో మేనిఫెస్టోలో రేషన్‌కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 400 రోజులైనా అతీగతీలేదన్నారు. గ్రామసభల్లో రేషన్‌కార్డుల విషయమై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పిలుపుని చ్చారు. ఎలాంటి షరతులు లేకుండా మీసేవా, ప్రజాపాలన, కుటుంబ సర్వే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని అర్హులందరికీ కార్డులివ్వాలని డిమాండ్ చేశా రు.

వ్యవసాయం కూలీలకు భరోసానిచ్చే అంశంలో ప్రభుత్వం కోతలు విధించడం దుర్మార్గమన్నారు. తెలంగాణలో హామీలు అమలు చేయకుండా ఢిల్లీకి పోయి గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. 55 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, అందులో 44 వేల ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లేనని స్పష్టం చేశారు.

మినీ సూపర్ మార్కెట్లుగా అభివృద్ధి చేయాలి..

రేషన్ కార్డుల జారీ విషయంలో సీఎంకు హరీశ్‌రావు లేఖ రాశారు. అందులో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. అర్హులైన వారందరికీ బీపీఎల్ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అందించాలని డిమాం డ్ చేశారు. అన్ని రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా అభివృద్ధి చేసి, రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. తమ ప్రభుత్వం 2016 నుంచి 2022 వరకు మొత్తం 6,47,479 కొత్త రేషన్ కార్డులను అందజేసిందని వెల్లడించారు. ఆదాయ పరిమితిని పెంచి లబ్ధిదారులకు రేషన్‌కార్డులు జారీ చేయాలని లేఖలో ఆయన పేర్కొన్నారు.