calender_icon.png 27 September, 2024 | 10:37 PM

రేషన్ కార్డు ప్రామాణికంగా సర్వేతో బాధిత కుటుంబాలకు అన్యాయం

27-09-2024 08:00:13 PM

కోదాడ,(విజయక్రాంతి): ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరదల వల్ల కలిగిన నష్టం అంచనాకు రేషన్ కార్డు ప్రామాణిక తీసుకోవడం వల్ల అనేక కుటుంబాలకు నష్టం జరుగుతుందని, అధికారులు అధికార పార్టీ నాయకుల కనుసన్నళ్ళో సర్వే చేసి భాదితులకు అన్యాయం చేసారని కూచిపూడి మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు అన్నారు. కూచిపూడి గ్రామంలో అత్యధిక శాతంగా నష్టపోయిన వరద బాధితులకు ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారం విషయంలో  ఆధ్వర్యంలో అన్యాయం జరిగిందని శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వమే రేషన్ కార్డు ప్రామాణికం కాదని చెప్తుంటే కింది స్థాయి అధికారులు రేషన్ కార్డు అర్హతతో నష్ట పరిహారం చెల్లించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి చంద్రయ్య, గోపి, ప్రసన్న కుమార్, దుద్దెల నాగేంద్ర బాబు, నాగల్ల నాగేశ్వరరావు, సుశీల భాదితులు తదితరులు పాల్గొన్నారు.