calender_icon.png 20 January, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతిఒక్కరికి రేషన్ కార్డు

20-01-2025 12:17:30 AM

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జనవరి 19 (విజయక్రాంతి) : ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రేషన్ కార్డుల, జారీ ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియని చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదివారం మెదక్ మండలం పాతూర్ గ్రామంలో న్యూ రేషన్ కార్డ్ వెరిఫికేషన్ క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఇంతకుముందు జరిగిన సర్వేలలో ఎప్పుడు దరఖాస్తు ఇవ్వకపోయినా గ్రామ సభలో వాళ్ళ చేత కొత్త దరఖాస్తులు తీసుకోబడతాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యంగా వివరించారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామసభలలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారిచేసినట్లు ఆయన వివరించారు.

ప్రస్తుతం రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా సామాజిక, ఆర్ధిక, కుల, రాజకీయ సర్వే ఆదారంగా తయారు చేసిందని,  ఇది తుది జాబితా కాదని స్పష్టం చేశారు.  ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 ప్రతిష్టాత్మక పధకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి అమలుకు శ్రీకారం చుట్టబోతుందని తెలిపారు. 

ఈ నెల 21 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను  ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆయనస్పష్టంచేశారు.