- 10 ఏండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క కార్డు ఇవ్వలేదు
- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు
పెద్దపల్లి, జనవరి 19: పెద్దపెల్లి నియోజక వర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందిస్తామని, గత 10 ఏండ్ల లో బిఆర్‌ఎస్ పాలనలో ఒక్క కార్డు కూడా ఇవ్వ లేదని సుల్తానాబాద్ పట్టణంలో ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతిని ధులు, నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రా ష్ర్టంలో ప్రజల ఆలోచన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ను అమలు పరచడంలో చిత్తశుద్ధితో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళుతుంటే, ప్రతిపక్ష బిఆర్‌ఎస్, బిజెపి,లు ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నాయని అన్నారు
. గత 10 సంవత్సరాల కాలంలో బీ.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క హామీని అమలు పరచలేదని కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును అందించారని బిఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని పేర్కొన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం లో కొత్త కార్డులు అర్హులైన వారందరికీ అందించేందుకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంక్షేమ పథకాలను అమ లు పరుస్తుంటే హరీష్ రావు కేటీఆర్ తెల్లారి లేచింది మొదలు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి తోడు బిజెపి అన్నారు.
కుటుంబ ఆర్థిక స్థితి గతుల పైన అధికారులు స్వయంగా గ్రామాల్లోకి వచ్చి ఇల్లు ఇల్లు తిరుగుతూ బీసీ ఎస్సీ ఎస్టీ లపై సమగ్ర సర్వే చేస్తున్నారని రాష్ర్టంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రేషన్ కార్డులో పేరు నమో దులు, తీసివేతలు చేపడుతున్నారని తెలిపా రు. 18 లక్షల 515 మంది గతంలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నారని 12,07,558 మంది రేషన్ కార్డుల పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు.
10 ఎకరాల లోపు ఉన్న వారికి ఏడున్నర ఎకరాల పుష్కి మూ డున్నర ఎకరాల తరి ఉన్న రైతులకు రేషన్ కార్డులు ప్రభుత్వం అందిస్తుందని దాదాపు పేదలందరికీ రేషన్ కార్డులు అందుతాయి అన్నారు. 12 సంవత్సరాల కాలంగా పెళ్లి అయిన నూతన దంపతులకు రేషన్ కార్డులు అందించిన పాపాన పోలేదని ప్రస్తుతం తాము ఆ దంపతులకు రేషన్ కార్డులను అందిస్తున్నామని పేర్కొన్నారు.
జనవరి 26 నుండి రాష్ర్ట ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకా న్ని ప్రజలకు అందించేందుకు కషి చేస్తుంద న్నారు. గగ్గోలు పెడుతున్న బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఎందుకు రాస్తారోకోలు ధర్నాలు చే స్తుందో తెలియడం లేదని, ఇందిరమ్మ ఇం డ్లు రైతులకు భరోసా, రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఏడాదికి రూ.12 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముం దుకు వచ్చినందుకు గగ్గోలు పెడుతుందా అర్థం కావడంలేదని అన్నారు.
10 సంవ త్సరాల కాలంలో ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలా లు లేవని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇందిర మ్మ ఇల్లు స్థలం ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకు అందిస్తామని అనంతరం ప్రభుత్వమే స్వ యంగా ఇంటి స్థలం అందించి ఇల్లు నిర్మా ణం చేసి ఇస్తుందని తెలిపారు. 29 రాష్ట్రా లలో రైతు కూలీలకు నెలకు ?1000 ఇచ్చిన దాఖలాలు ఏ రాష్ర్టంలో లేవని దేశవ్యా ప్తంగా అది ఒక తెలంగాణ రాష్ర్టంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభు త్వం అందిస్తున్నారని పేర్కొన్నారు.
రేషన్ కార్డు రాలేదని ఏ ఒక్కరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, గ్రామ సభలలో రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకుంటే అతి త్వరలో రేషన్ కార్డు అందించేందుకు అధికా రులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుందని, తమ ప్రభుత్వ ప్రజాప్రతినిధుల బాధ్యత అని హామీ ఇచ్చారు.
ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న, మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకు న్న ప్రతి అర్హుడికి కార్డు అందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మినుపాల ప్రకాష్ రావు, ఈర్ల స్వరూప, కేడీసీసీ జిల్లా డైరెక్టర్ శ్రీగిరి లతోపాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.