calender_icon.png 9 February, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండువగా ఆదినారాయణ స్వామి రథోత్సవం

08-02-2025 11:41:35 PM

అధిక సంఖ్యలో హాజరైన భక్తులు.. 

పటాన్‌చెరు: తెలంగాణ కంచిగా ప్రసిద్ధి చెందిన  కొడకంచి ఆదినారాయణ స్వామి రథోత్సవం శనివారం కన్నుల పండువగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా భూదేవి, శ్రీధేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి రథోత్సవంపై కొడకంచి పురవీదుల్లో ఊరేగారు. ఈ మదురమైన ఘట్టాన్ని వీక్షించేందుకు జిన్నారం మండల ప్రజలతో వివిద మండలాల ప్రజలు భారీగా హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదినారాయణ స్వామిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ఆదినారాయణ స్వామి జాతర, రథోత్సవానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావు హాజరయ్యారు. పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు హాజరై స్వామిని దర్శించుకున్నారు.