శ్రీ బాలేశ్వర స్వామి ఉత్సవాలు..
ప్రత్యేక పూజలు నిర్వహించిన న్యాయమూర్తి అనంతలక్ష్మి, ఎస్పీ డివి శ్రీనివాసరావు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రథ సప్తమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీ బాలేశ్వర స్వామి ఆలయ సమీపంలో గల ఉత్తర వాహిని వద్ద మంగళవారం వైభవంగా రథోత్సవం నిర్వహించారు. గత వారం రోజులుగా బాలేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మికత సంతరించుకుంది. ప్రతిరోజు వివిధ పూజలు, హోమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం చేపట్టారు. ముగింపు సందర్భంగా ఆలయ సమీపంలో అత్యంత వైభవంగా నిర్వహించిన రథోత్సవం వేడుకలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వేడుకల సందర్భంగా ఉత్తరవాహినీ నది సమీపంలో జాతరను నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి ప్రజలు జాతరకు తరలివచ్చారు.
ఆలయంలో అర్చకుడు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. న్యాయమూర్తి అనంతలక్ష్మి దంపతులు స్వామి వారికి అభిషేకం చేపట్టారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతరవద్ద మున్సిపల్ కమిషనర్ భుజంగరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను చేశారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఏఎస్పి చిత్తారంజన్ పర్యవేక్షణలో సిఐ రవీందర్ బందోబస్తును ఏర్పాటు చేశారు.