బంగారు రథంపై స్వామి వారి ఊరేగింపు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) ః యాదగిరిగుట్టలో స్వయంభూనిగా వెలసి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నేడు రథసప్తమి వేడుకలు ఘనంగా జరుపుతున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం 8 గంటలకు ఆలయ తిరుమాడ వీధులలో రంగ రంగ వైభవంగా ఊరేగింపు జరుపుతున్నట్లు తెలిపారు. అనంతరం తూర్పు రాజగోపురం వద్ద చతుర్వేద పారాయణం, రథసప్తమి విశిష్టత భక్తులకు విసిదీకరించబడుతుందని వివరించారు.
రాత్రి 7 గంటలకు శ్రీ స్వామి వారు బంగారు రథం పై ఆలయ అంత ప్రాకారంలో ఊరేగింపబడును. రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు శ్రీ స్వామివారి ఆలయం నందు భక్తులచే జరుపబడు సువర్ణ పుష్పార్చన కార్యక్రమం రద్దు చేసినట్లు ఈవో ప్రకటించారు.