రాజాపూర్, ఫిబ్రవరి 4: రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని మంగళ వారం మండలంలోని ఆయా ఆయా గ్రామాల్లో రథసప్తమి వేడుకలు ఘనం గా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికా ర్జున స్వామి దేవాలయంలో గ్రామ స్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జుంటుపల్లి కష్ణారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ చేశారు.
ఈ కార్యక్రమానికి వివిధ మండలా ల భక్తులు హనుమాన్ చాలీసా పారా యణ చేశారు .అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదానం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో లింగారెడ్డి, మల్లయ్య, భీమయ్య, నర్సింహారెడ్డి, బాలయ్య, రామ్మూర్తి, జగదీశ్వర్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.