05-02-2025 12:41:30 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి) : రథసప్తమి వేడుకలను మంగళ వారం వైభవంగా నిర్వహించారు. రథసప్తమి ఉత్సవాలలో భాగంగా నిజామాబాద్ నగరంలోని ప్రముఖ నీలకంఠేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏడు రథసప్తమి సందర్భంగా జరిగే జాతర ఉత్సవాలలో నిజామాబాద్ జిల్లా ప్రజలే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఆల యానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
మంగళవారం రోజు రథసప్తమి సందర్భంగా ఉదయం నుంచి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. శ్రీ నీలకంటేశ్వరా లయంలో స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. పండితులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే సాయంత్రం శ్రీ నీలకంటేశ్వర స్వామి వారి పూజ కార్యక్రమం అనంతరం నిర్వహించనున్న రథయాత్ర నిర్వహించారు. ఇటీవల స్వామి వారికి ఏర్పాటు చేసిన నూతన రథాన్ని పూలతో అలంకరణ చేశారు. అనంతరం స్వామివారి రథ ఊరేగింపు భక్తి పరవశంతో భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.