calender_icon.png 18 January, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్రవ్యోల్బణం బాట ఆధారంగానే రేట్ల కోత

17-09-2024 12:11:50 AM

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: వడ్డీ రేట్ల తగ్గింపుపై తమ నిర్ణయం ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక గమనంపై ఆధారపడి ఉంటుందని, నెలవారీ గణాంకాలపై ఆధారపడి ఉండదని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. త్వరలో యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఫెడ్ నిర్ణయం సెప్టెంబర్ 18న వెలువడనుండగా, ఆర్బీఐ గవర్నర్ నేత్వంలోని మానిటరీ పాలసీ కమి టీ (ఎంపీసీ) అక్టోబర్ 7 నుంచి 9 వరకూ జరిపే సమీక్షలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది.

అధిక ఆహార ద్రవ్యోల్బణం కార ణంతో వరుసగా గత తొమ్మిది సమీక్షా స మావేశాల్లో ఆర్బీఐ రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా అట్టిపెట్టింది. తాజాగా దాస్ ఒక ఆంగ్లఛానల్‌తో మాట్లాడుతూ ద్రవ్యోల్బ ణం ఏ నెలకు ఏ నెల పెరుగుతూ పోతున్నదా, నెమ్మదిస్తున్నదా అనే అంశంపై ఆర్బీ ఐ దృష్టి నిలుపుతుందని, రానున్న ద్రవ్యోల్బణం బాటను సునిశితంగా పర్య వేక్షిస్తామని, అటుపై విశ్లేషణ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. 

ప్రస్తుత ట్రెండ్ ముఖ్యం కాదు

‘ ప్రస్తుతం, అంటే జూలైలో ద్రవ్యోల్బణం 3.6 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో 3.7 శాతంగా వచ్చింది. ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎంత ఉన్నదన్నది ముఖ్యం కాదు. వచ్చే ఆరు నెలల్లో, వచ్చే ఏడాది  మొత్తానికి ఎలా ఉంటుందన్నది మేము చూడాలి. ఏ మేరకు ఉంటుందో అంచనా వేసుకోవాలి. అంటే, ఒక అడుగు వెనక్కువేసి భవిష్యత్ ద్ర వ్యోల్బణం బాట, వృద్ధి ఎలా ఉంటుందన్న అంశాన్ని జాగ్రత్తగా చూడాలి.

దాని ఆధారం గా మేము ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని శక్తికాంత్ దాస్ వివరించారు. అక్టోబర్ మీట్ లో రేట్ల కోతను మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) పరిశీలిస్తుందా అన్న ప్రశ్నకు ఆర్బీఐ గవర్నర్ స్పందిస్తూ ‘అది నేను చెప్పలేన’ని అన్నారు. ఎంపీసీలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

వృద్ధి బాగుంది

భారత్ వృద్ధి పటిష్టంగా ఉన్నదని, రానున్న కాలంలోనూ కొనసా గుతుందని దాస్ ధీమాగా చెప్పారు. అంతర్జాతీయ కరెన్సీలన్నింటిలో రూ పాయి ఒడిదుడుకులు తక్కువస్థాయిలో ఉన్నాయన్నారు. యూఎస్ డాలర్‌తో, వొలటాలిటీ ఇండెక్స్‌తో పోల్చిచూసినా రూ.2023 ప్రారం భం నుంచి  స్థిరంగానే ఉన్నదన్నారు. ఆర్థిక స్థిరత్వానికి ఆర్బీఐ కట్టుబడి ఉన్నదని, అందుకు తగిన చర్యలు తీసుకుంటుందని గవర్నర్ చెప్పారు.