calender_icon.png 12 February, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రతన్ టాటా వీలునామాలో రహస్య వ్యక్తి పేరు

08-02-2025 12:35:06 AM

ఎవరీ మిస్టరీ మ్యాన్..?

ముంబై: టాటా సంస్థల అధినేత రతన్ టాటాకొన్ని రోజుల క్రితం కాలం చేసిన విషయం తెలిసిందే.  అయితే వీలునామాలో ఓ రహస్య వ్యక్తికి రూ.౫౦౦ కోట్లు ఇవ్వాలంటూ రతన్ టాటా పేర్కొనడంపై టాటా కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

ఆ మిస్టరీ పర్సన్ ఎవరో కాదు దాదాపు ఆరు దశాబ్దాలుగా రతన్ టాటాకు నమ్మకస్తుడిగా సేవలు అందించిన జంషెడ్‌పూర్‌కు చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా  అని తెలిసింది.

తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో 2013 నుంచి మోహన్ దత్తాకు చెందిన స్టాలియన్  ట్రావెల్ ఏజెన్సీ కలిసి పనిచేస్తోంది. అంతేకాదు టాటా కుటుంబానికి మోహన్ దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారని టాటా గ్రూప్‌నకు చెందిన అధికారులు తెలిపారు. మోహన్ దత్తాకు తన ఆస్తిలో రూ.500 కోట్లు ఇవ్వాలని రతన్ టాటా వీలునామాలో పేర్కొన్నట్లు తెలిసింది.