calender_icon.png 11 October, 2024 | 6:55 AM

విలువలే ఆస్తి

11-10-2024 02:30:45 AM

రతన్ టాటా అన్నీంటా ఆదర్శప్రాయులు

నాణ్యత, నమ్మకమే పెట్టుబడి

ముంబై, అక్టోబర్ 10: ఉన్నత జీవన ప్రమాణాలు.. దాతృత్వం.. వ్యాపార నిర్వహణ.. ఇలా అన్నీంటిలోనూ ఆదర్శంగా నిలిచి.. అందరి వాడిలా జీవించారు రతన్ టాటా. అనేక విషయాల్లో ప్రత్యేకతను చాటుకొని దట్ ఈజ్ రతన్ టాటా అనిపించుకు న్నారు.

ఏ వ్యాపారమైనా నాణ్యత, నమ్మకమే పెట్టుబడిగా అంచెలంచెలుగా ఎదిగిన టాటా గ్రూప్ ప్రస్థానంలో రతన్ టాటా కృషి అసామన్యమైంది. నిత్య మార్గదర్శిగా, దాతృ త్వమూర్తిగా, మానవతావాదిగా పేరొందిన రతన్ టాటా ప్రపంచంలోనే దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. లాభాల కంటే చిత్తశుద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చే నైజాం ఆయనపై అపారమైన గౌరవం ఏర్పడేలా చేసింది. అందుకే లాభాల కోసమే వెంపర్లాడే వ్యాపారవేత్తలు టాటాతో ఏ మాత్రం సరితూగరు.  

* రతన్ టాటా తన టాటా గ్రూప్ నుంచి వచ్చే ఆదాయంలో అధిక భాగం సేవా కార్యక్రమాలకే ఖర్చుచేశారు. వ్యాపారంలో నైతికతను పాటిస్తూనే సామాజిక బాధ్యత తీసుకోవాలని చెబుతుంటారు.

* దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాధినేత టాటా ఆర్భాటాలకు ఆమడదూరంలో ఉన్నారు. వినయమే ఆడంబరంగా సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడ్డారు.

* మధ్య తరగతి జీవితంలో కారు కొనుగోలు ఓ కల. దాన్ని నెరవేర్చడానికి ఎంతో కష్టపడ్డారు. అతితక్కువ ఖర్చుతో వినియోగదారులకు నానోకారు తీసుకొచ్చి సంచలనం సృష్టించారు. 

* ప్రపంచ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించిన టాటా.. ఏనాడు తన భారతీయ మూలాలను మరువలేదు. సంస్కృతి, సంప్రదాయాలకు అత్యధికంగా విలువిస్తూనే ప్రపంచంతో పోటీ పడ్డారు.

* 2008 ముంబైలోని తాజ్‌హోటల్‌లో ఉగ్రదాడితో ప్రపంచమే నివ్వెరపోయిన వేళ టాటా తన ఉదారత చాటుకున్నారు. బాధితులకు జీవితాంతం అండగా ఉన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 

* తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పట్ల టాటా ప్రత్యే శ్రద్ధ చూపారు. టాటా స్టీల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు చనిపోయినప్పుడు వారి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. 


‘ఆ టైం ఎంతో కష్టకాలం’

దాదాపు 16 ఏండ్ల క్రితం (2008 నవంబర్ 26) పాకిస్థాన్ ముష్కరులు ముంబైలో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో మొదట ఉగ్రవా దులు 1903లో ముంబైలో స్థాపించిన తాజ్ హోటల్‌లోకి చొరబడి నరమేధం చేశారు. బాంబు పేలుళ్లు జరిపారు. దీంతో తాజ్ హోటల్‌కు తీవ్ర నష్టం జరిగింది. హోటల్‌ను కొన్ని రోజులపాటు మూసివేశారు.

ఆ సమయంలో సవాళ్లను ఎదుర్కొన్నారో ఓ ఇంటర్వ్యూలో టాటా వెల్లడించారు. తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠిన సమయాల్లో తాజ్ పై జరిగిన దాడి ఒకటని ఆయన చెప్పారు. తాజ్ హోటల్‌లో ముష్కరులు దాదాపు 60 గంటలపాటు మారణహోమం సృష్టించారన్నారు. ఆ దాడి తాజ్‌తోపాటు తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. అదే సమయంలో స్టీల్ మార్కెట్ కుప్పకూలింద న్నారు.

బ్యాంకింగ్ వ్యవస్త దెబ్బతిందన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మళ్లీ హోటల్ పునరుద్ధరించేందుకు టాటాగ్రూప్ సిద్ధమైం దని వివరించారు. నెలరోజులకు హోటల్‌ను తిరిగి తెరిచినప్పటికీ పూర్వ వైభవం రావడానికి చాలా సమయమే పట్టిందని చెప్పారు. హోటల్‌ను రిపేర్ చేయడానికి దాదాపు రూ. 8 వేల కోట్లను ఖర్చుతో రెండేళ్లు పట్టిందన్నారు. 

టాటా జీవితం దేశానికి అంకితం

దేశాభివృద్ధికి రతన్ టాటా తన సర్వస్వాన్ని అంకితం చేశారు. నేను టాటాను కలిసిన ప్రతీసారి ప్రజల అభ్యున్నతి గురించే మాట్లాడేవారు. ఆయన నిబద్ధత ఆశ్చర్యపరిచేది. టాటా మరణించినా ప్రజలందరి హృదయాల్లో ఎల్లకాలం జీవించి ఉంటారు.

అమిత్ షా

ఓ వెలుగు వెలిగారు

* రతన్ టాటా నాయకత్వంలోను, దాతృత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. ప్రపంచ వ్యాపార రంగంలో చెరగని ముద్ర వేశా రు. టాటా జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో చిరకాలం పదిలంగా ఉంటాయి.

 హర్ష్ గోయెంకా, 

ఆర్‌పీజీ గ్రూప్ చైర్‌పర్సన్

జాతి గర్వించదగ్గ వ్యక్తి

* రతన్ టాటా జాతి గర్వించదగ్గ వ్యక్తి. ఆయన మరణ వార్త విని ఎంతో బాధపడ్డా. అనేక ఏండ్ల నుంచి ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఉద్యోగ కల్పనకు టాటా చేసిన కృషి ఎనలేనిది. 

నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి

దూరదృష్టి కలిగిన దార్శనీకుడు

* రతన్‌టాటా మరణించిన విషయం ఇప్పుడే తెలిసింది. ఒక శకం ముగిసింది. అత్యంత గౌరవనీయులు, వినయం కలిగిన వ్యక్తి. మేం కలిసి పాల్గొన్న అనేక కార్యక్రమాల్లో ఆయనతో అద్భుతమైన క్షణాలు గడిపాను. 

 అమితాబ్‌బచ్చన్, బాలీవుడ్ నటుడు

రతన్‌టాటాకు ప్రముఖుల సంతాపం

పేరుప్రఖ్యాతలు గడించారు

పనిపట్ల ఆయన నిబద్ధతతో పాటు నిజాయితీతో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు గడించా రు. భాతదేశ పారిశ్రామికరంగంలో రతన్ టాటా ఎందరికో స్ఫూర్తిదాయకం. సమాజసేవలోనూ ఆయనకు ఆయనే సాటి. విద్య, వైద్యం ఇలా అనేక రంగాల్లో ఆయన సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి

 బండారు దత్తాత్రేయ, 

హర్యాన గవర్నర్ 

భారత పారిశ్రామిక దిగ్గజం 

తరాల తరబడి ప్రజల్లో స్ఫూర్తి నింపి న ఓ అమూల్యమైన రతనాన్ని భారతదేశం కోల్పోయింది. పరిశ్రమలతో పాటు టెక్నా లజీ, అటోమొబైల్, విద్యుదుత్పత్తి తదితర రంగాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యరంగానికి రతన్ టాటా ఓ ఆదర్శ మూర్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. 

          కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి 

దిగ్భ్రాంతికి గురిచేసింది 

రతన్ టాటా గొప్ప విలువలు కలిగిన వ్యక్తి. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధ్ది రంగాల్లో ఆయన విశేష సేవలు అందించారు. ఆయన మృతి దిగ్భ్రాంతికి గురిచేసిం ది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తుననా.

 గడ్డం ప్రసాద్‌కుమార్, 

తెలంగాణ శాసనసభ స్పీకర్

యావత్ దేశానికే తీరని లోటు

భారతదేశం రతన్‌టాటా లాంటి గొప్ప పారిశ్రామికవేత్తను కోల్పోయింది. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగంతో పాటు యావత్ దేశానికి తీరని లోటు. ఆయ న మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన ఎనలేని సేవలు అం దించారు. వారి కుటుంబానికి నా ప్ర గాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

  రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

గొప్ప మానవతావాదిని కోల్పోయాం

టాటా మరణం దేశానికి తీరని లోటు. దేశం ఒక గొప్ప మానవతా వాదిని కోల్పోయింది. ఆయ న సంపాదించిన దాని లో మెజార్టీ భాగం సేవాకార్యక్రమాలకే ఖర్చు చేసేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.

 మహేష్‌కుమార్‌గౌడ్, 

టీపీసీసీ అధ్యక్షుడు

సమాజ శ్రేయస్సు కోసం పరితపించారు

భారతదేశం గర్వించదగ్గ ప్రపంచ వ్యాపార దిగ్గజం, పద్మవిభూషణ్ రతన్‌టాటా మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆర్ధిక ప్రగతితో పాటు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా. ఆయన మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని, ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.

 కేసీఆర్, మాజీ సీఎం

నిబద్ధతకు నిలువుటద్దం 

దేశం ఒక గొప్ప దార్శనికుడిని, పారిశ్రామికవేత్తను కోల్పో యింది. రతన్ టాటా నిబద్ధతకు నిలువుట ద్దం. విలువలకు ప్రతిరూపం. దేశ పారిశ్రామిక అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. రతన్ టాటా ఆత్మకు శాంతి కలగాలని  భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 

 మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి