calender_icon.png 24 January, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులంలో ఎలుకల బెడద

12-07-2024 02:48:03 AM

12 మంది విద్యార్థులను కరిచిన చిట్టెలుకలు

ప్రిన్సిపాల్‌ను నిలదీసిన బాధితుల తల్లిదండ్రులు

మెదక్, జూలై 11 (విజయక్రాంతి): మెదక్ జిల్లా రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకులంలో విద్యార్థులు నిద్రిస్తున్నప్పుడు ఎలుకలు కరిచాయి. విద్యా ర్థుల తల్లిదండ్రులు గురువారం గురుకులానికి వచ్చి ప్రిన్సిపాల్‌ను నిలదీయ డంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు గురుకులంలో కలియదిరిగి విద్యాలయంలో పారిశుధ్య చర్యలు చేపట్టడం లేదని గుర్తించారు. మురుగు కాలువలు నిండి, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వ్యాపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమలు, ఎలుకలతోవిద్యార్థులునిద్రించలేకపోతున్నాని మండిపడ్డారు.