హైదరాబాద్ (విజయక్రాంతి): కేంద్రీయ విద్యాలయం ఒక శక్తివంతమైన మినీ ఇండియా లాంటిదనీ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి వివిధ మాతృభాషల విద్యార్థులు ఇక్కడ చదువుకోవడంతో సంఘటన్ లోని ప్రతి పాఠశాల భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా ఉంటున్నాయని అన్నారు. దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ఉన్నప్పటికీ సమాజంలో ఐక్యత, ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారడానికి కృషి చేస్తున్న ఈ సమయంలో యువతే మన గొప్ప బలం అని నమ్ముతున్నాను అని అన్నారు.