ప్రముఖ నటి రష్మిక మందన్నాకు గాయమైంది. ఇటీవల ఆమె జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గాయపడినట్టు తెలుస్తోంది. వైద్యులు ఆమెకు కొద్ది రోజుల పాటు విశ్రాంతి సూచించారట. ప్రస్తుతం రష్మిక కోలుకుంటున్నట్టు సమాచారం. ‘పుష్ప 2’ అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ సాధించడంతో రష్మిక అన్ని ఇండస్ట్రీల్లోనూ క్రేజ్ బాగా పెరిగింది. ‘పుష్ప 2’ తర్వాత రష్మిక కెరీర్ పరంగా బాగా బిజీ అయిపోయింది.
బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా రూపొందుతున్న ‘సికిందర్’ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా చేస్తోంది. గాయం కారణంగా ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిందట. అలాగే ‘థామా’ అనే బాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది.
మరోవైపు ఇప్పటికే ‘ఛావా’ అనే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ చిత్రాల్లో రష్మిక నటిస్తోంది. త్వరలోనే రష్మిక కోలుకుంటుందని.. తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.