అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప : ది రూల్’ చిత్రంలో కథానాయికగా రష్మిక మందన్నా నటించారు. సినిమా డిసెంబర్ 5న విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా చెన్నైలో చిత్ర యూనిట్ వైల్డ్‌ఫైర్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘మీకు చాక్లెట్ బాయ్ అంటే ఇష్టమా? లేదంటే రౌడీ బాయ్ అంటే ఇష్టమా? అని యాంకర్ ప్రశ్నించగా.. ‘ఆ రెండింటి కాంబినేషన్ అంటే ఇష్టం’ అని రష్మిక తెలిపారు. ఆ తర్వాత ‘సినీ పరిశ్రమలోని వ్యక్తిని పెళ్లాడుతారా? బయటి వ్యక్తిని పెళ్లాడతారా?’ అని ప్రశ్నించగా.. అది అందరికీ తెలిసిన సమాధానమేనని బదులిచ్చిందీ బ్యూటీ. రష్మిక చెప్పిన ఈ జవాబుతో ప్రాంగణమంతా అరుపులు, కేకలతో మారుమోగింది. ఆ తర్వాత తనకు గోవాలో బంగ్లా ఏమీ లేదని.. తాను ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నానని రష్మిక తెలిపారు.