calender_icon.png 25 December, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రష్మిక

06-11-2024 12:00:00 AM

రష్మిక మందన్నా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికిందర్’ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో జరుగుతోంది. మురుగుదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముంబై షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వెంటనే తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యింది.

రష్మిక షూటింగ్ హైదరాబాద్‌లో అని తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఫలక్‌నుమా ప్యాలెస్‌కు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో రష్మిక ఫలక్‌నుమా డోర్ వద్ద నిలబడి సన్నివేశం కోసం ప్రిపేర్ అవుతూ కనిపించారు.

సల్మాన్ ఈచిత్రంలో రాజవంశస్తుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సికిందర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తూ ఉండటంతో రష్మిక, కాజల్, సత్యరాజ్ వంటి దక్షిణాదికి చెందిన ప్రముఖ నటులకు కీలక పాత్రల్లో అవకాశాలు కల్పించారు.