06-07-2024 12:34:49 AM
న్యూఢిల్లీ, జూలై 5 : ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్, అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్ రషీద్ శుక్రవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు. జైలు లో ఉన్న వీరిద్దరూ పేరోల్‌పై వచ్చి ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశా రు. ఉగ్రవాదులకు నిధు లు సమకూరుస్తున్నాడనే ఆరోపణలపై రషీద్‌ను గతంలో ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ గతంలో జాతీయ భద్రత చట్టం కింద అరెస్టయ్యారు. ఆయన అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వీరిద్దరూ విజయం సాధించారు. రషీద్ జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచి.. గెలిచారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా అమృత్‌పాల్ సింగ్ పోటీ చేసి గెలిచారు.