calender_icon.png 3 March, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారి ప్రాణం తీసిన ర్యాష్ డ్రైవింగ్

02-03-2025 10:55:54 PM

కారు ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి..  

మరో ఇద్దరికి గాయాలు.. 

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): ర్యాష్ డ్రైవింగ్ ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని స్విఫ్ట్ కారు ఢీకొనడంతో మృతి చెందగా మరో ఇద్దరు చిన్నారులకు గాయాలైన సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పాండురంగానగర్ లో శంకర్ నాయక్, గీత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి మూడేళ్ల కూతురు అంకిత ఆదివారం సాయంత్రం ఇరుగుపొరుగున ఉండే చిన్నారులతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటుంది. అంతలో ఓ స్విఫ్ట్ కారు డ్రైవర్ ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆడుకుంటున్న చిన్నారి అంకితను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలను వదిలింది.

ఈ ప్రమాదంలో మరో ఇద్దరు చిన్నారులకు గాయాలాయ్యాయి. స్థానికులు నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్ ను పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. అల్లరి ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి అంకిత మృతితో తల్లిదండ్రులు శంకర్ నాయక్ గీత దంపతులు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అందరిని కలచివేసింది. ఈ మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.