24-04-2025 05:29:55 PM
రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు యెర్రా కామేష్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జై భీమ్ రావు భారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు తార్నాకకు చెందిన రాసపల్లి కళ్యాణ్ ను హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు యెర్రా కామేష్ నియమించారు. ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ... ఎవరైతే దెబ్బలు తింటారో వాళ్లే కేకలు వెయ్యాలని చెప్పిన మహాత్మ జ్యోతిబా ఫూలే వ్యాఖ్యలను బహుజనులు ఆదర్శంగా తీసుకొని, సమానత్వం కోసం, తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షుడు రాసపల్లి కళ్యాణ్ మాట్లాడుతూ... త్వరలో జిల్లా వ్యాప్తంగా పర్యటించి జిల్లా కమిటీల నిర్మాణం చేసి, పోలింగ్ బూత్ స్థాయి వరకు కమిటీ లు ఏర్పాటు చేస్తానని, పార్టీ బలోపేతం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలను చైతన్యపరిచి వారిని మమేకం చేసి ప్రజా ఉద్యమాలు చేపడుతామన్నారు. సమతా సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. బహుజనులు నూతన రాజకీయ శక్తిగా ఎదగాలన్నారు. భీమ్ రావు అంబేద్కర్ గారి ఆలోచనా విధానమే బహుజనులకు రక్షణ అని తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడుగా నియమించిన జాతీయ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ కు, రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు యెర్రా కామేష్ లకు ధన్యవాదాలు తెలిపారు.