మేడ్చల్, జనవరి 30(విజయ క్రాంతి): మేడ్చల్ మండలం పూ శివారులోని బీజేపీ ఎంపీ ఈ రాజేందర్ నివాసానికి గురువా బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వచ్చారు. వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడారు. అక్క వచ్చిన పలువురు రసమయి బాలకిషన్‌తో ఫోటోలు దిగారు. ఈటల నివాసానికి బాలకిషన్ రావ రాజకీయవర్గాలలో చర్చనీయాం వీరిద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు. గతంలో ఒకే పార్టీలో ఉన్నారు.
ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నా అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ అగ్ర నేతలకు, ఈటలకు సంబంధాలు లేవు. ఎవరైనా ఈటలను కలిస్తే బీఆర్ఎస్లో ప్రాధాన్యం తగ్గుతుందని టాక్. ఇలాంటి పరిస్థితుల్లో రసమయి బాలకిషన్ ఈటల నివాసానికి వెళ్లడంపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. అయితే రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ కార్య చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా బాల్కొం నియోజకవర్గంలో జరిగిన రైతు అధ్యయన కమిటీ పర్యటనలోనూ పాల్గొన్నారు.