calender_icon.png 20 April, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్ మున్సిపల్ కార్మిక సంఘ అధ్యక్షుడిగా రాసకొండ శ్రీనివాస్

09-04-2025 05:12:12 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ బెల్లంపల్లి మున్సిపల్ కార్మిక సంఘ నూతన అధ్యక్షునిగా రాసకొండ శ్రీనివాస్ మాదిగ బుధవారం ఎన్నికయ్యారు. బెల్లంపల్లి పట్టణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా రమేష్, రాజేశ్వరి, అధికార ప్రతినిధిగా తోటపల్లి ప్రతాప్, ప్రధాన కార్యదర్శిగా బాలరాజు, కార్యదర్శి గా మధునయ్య, శేఖర్, కోశాధికారిగా రాములు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి మండల ఇన్చార్జి జిలకర శంకర మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్నరాజం, మచ్చ రాజేష్, నాతర శివ, ప్రధాన కార్యదర్శి రత్నం ఐలయ్య లు పాల్గొన్నారు.