calender_icon.png 11 January, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్‌లో అరుదైన గుండె శస్త్రచికిత్స

03-11-2024 04:12:28 AM

దేశంలోనే మొదటిసారి 35 ఎంఎం కృత్రిమ కవాటం అమరిక

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): చిన్నతనం నుంచే టెట్రాలజీ ఆఫ్ ఫాలో (టీవోఎఫ్) అనే గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ యువకుడికి పంజాగుట్టలోని నిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి కార్డియాలజీ డాక్టర్ సాయిసతీశ్ తెలిపారు. శనివారం నిమ్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నారాయణపురానికి చెంది న బానోత్ అశోక్ అనే యువకుడికి చిన్నతనంలోనే బైపాస్ సర్జరీ అయిందని, కొన్నేళ్లు గా అతని గుండెకు కుడివైపు ఉండే పల్మినరీ కవాటం దెబ్బతిన్నట్లు తెలిపారు.

దీంతో రక్తం కారడంతో ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ సరిగా జరగక అతను నీలంగా మారిపో యాడని చెప్పారు. అతనికి తమ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స ద్వారా దేశంలోనే మొదటిసారి 35 ఎంఎం కృత్రిమ పల్మినరీ కవాటాన్ని అమర్చినట్లు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్స ద్వారా మరో 15 ఏళ్లు అతడికి ఎలాంటి ఇబ్బంది కలగదని స్పష్టం చేశారు. దాదాపు 3 గంటల పాటు ఈ శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు. సమావేశంలో డాక్టర్ హేమంత, డాక్టర్ శైలేష్‌భాటియా, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ త్యాగి, అనస్తీషియా డాక్టర్ అద్నాన్, సిబ్బంది ఓంప్రకాశ్, ప్రమీల, శ్రీనివాస్ బాబు, మీనాకుమారి, అశోక్ తల్లి సునీత పాల్గొన్నారు.