calender_icon.png 22 January, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికవర్ వైద్యుల అరుదైన చికిత్స

22-01-2025 07:25:18 PM

నవజాత శిశువుకు అరుదైన మిడ్ గట్ వోల్వులస్ శస్త్ర చికిత్స 

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): నేలలు నిండకుండా పుట్టిన నవజాత శిశువు అరుదైన మిడ్‌గట్ వోల్వులస్ శస్త్రచికిత్స నిర్వహించి శిశువు ప్రాణాలను కాపాడిన మెడికవర్ ఉమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు. ఈ మేరకు అందుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం బుధవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె మాట్లాడుతూ... “మిడ్‌గట్ వాల్వులస్ విత్ మాల్‌రోటేషన్ అనేది ప్రాణాంతక పరిస్థితి, దీనికి సకాలంలో చికిత్స చాలా అవసరమని, మాల్‌రోటేషన్ అనేది పుట్టుకతో వచ్చే (పుట్టుకలో ఉన్న) పరిస్థితి, ఇది శిశువు యొక్క చిన్న అలాగే పెద్ద ప్రేగులను వారి పొత్తికడుపు (బొడ్డు) లోపల ఉంచడాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. పిండం అభివృద్ధి ప్రారంభంలో ప్రేగులు ఏర్పడతాయని, ఆ ప్రక్రియలో భాగంగా, పేగులు సరైన స్థానానికి చేరుకునే వరకు చుట్టుకొని తిరిగి, ఉదర గోడకు జోడించబడతాయని పేర్కొన్నారు.

కానీ కొన్ని సందర్భాల్లో అవి సరిగ్గా కాయిల్ రొటేట్ చేయవని, దీన్నే ఇంటెస్టినల్ మాల్రోటేషన్ గా సూచిస్తుందని, వోల్వులస్ అనేది పిల్లల ప్రేగులకు రక్త సరఫరాను రాజీ చేసే ప్రేగులను అసాధారణంగా తిప్పే మాల్రోటేషన్ యొక్క ప్రధాన సమస్య అని అన్నారు. అనంతరం సెంటర్ హెడ్ డాక్టర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ... నవజాత శిశువులో పేగు సంబంధమైన లోపంతో కూడిన మిడ్‌గట్ వాల్వులస్‌కు సంబంధించిన అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా కావడం ఇది ఆసుపత్రి యొక్క అధునాతన పీడియాట్రిక్ సర్జికల్ నైపుణ్యం నియోనాటల్ కేర్ సామర్థ్యాలను నిదర్శనం అని అన్నారు. శిశువుకు అదే నెల డాక్టర్ మధు మోహన్ రెడ్డి, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె డాక్టర్ నవిత ఎమ్, డా. వంశీ రెడ్డి వారి బృందం సుమారుగా 4 గంటలు కష్టపడి శస్త్రచికిత్స నిర్వహించి డ్యూడెనమ్‌ను నిఠారుగా చేసి, మెసెంటరీని వెడల్పు చేయడం, సంశ్లేషణలను విడుదల చేయడం, అపెండెక్టమీ ప్రేగులను తిరిగి వాటి స్థానంలో ఉంచి శస్త్రచికిత్స చేశారు. తర్వాత శిశువుని ఐసీయూలో ఉంచి ఐవీ యాంటీబయాటిక్స్ పోషకాహారం అందించి, ఒక వారంలోనే నోటి ద్వారా ఫీడ్ ను అందించేలాగా చేశారు. శిశువు 27 నవంబర్ 2024న స్థిరమైన స్థితిలో 1.77 కిలోల బరువుతో డిశ్చార్జ్ చేశామని ఇప్పుడు శిశువు ప్రాణాపాయం లేదని ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు. చిన్నారి తల్లిదండ్రులు మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.