calender_icon.png 22 April, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉస్మానియా’లో అరుదైన శస్త్ర చికిత్స

18-04-2025 12:59:24 AM

మార్ఫాన్ సిండ్రోమ్, హెపటో పల్మనరీ సిండ్రోమ్ రోగిని కాపాడిన వైద్యులు

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): వైద్యచరిత్రలో సరికొత్త అధ్యయనానికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వేదికైంది. హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ సీహెచ్ మధుసూదన్ నాయకత్వంలోని బృందం, 14 ఏళ్ల బాలుడు జీ నిఖిల్‌రెడ్డికి అత్యంత క్లిష్టమైన లివర్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసింది.

ఈ బాలుడు మార్ఫాన్ సిండ్రోమ్ తో పాటు తీవ్రమైన హెపటో-పల్మనరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. ఇదివరకెప్పుడూ ప్రపంచం లో ఎక్కడా ఇలాంటి స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి జరగలేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గోకవ రం గ్రా మానికి చెందిన నిఖిల్‌రెడ్డికి ఏడేళ్ల వయస్సులో మార్ఫాన్ సిండ్రోమ్ ఉన్నట్టు గుర్తించారు.

12 ఏళ్ల వయస్సులో పిత్తకోశ వ్యాధికి సంబంధించిన లక్షణాలతో తమిళనాడు వెల్లూరు సీఎంసీ హాస్పిటల్‌లో పరీక్షించగా హెపటోపల్మనరీ సిండ్రోమ్ అని నిర్ధారిం చారు. ఉస్మానియాలో ప్రభుత్వ వైద్యులు అత్యంత తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తారని తెలిసి హైదరాబాద్ వచ్చారు. బాలుడి తల్లి స్వాతి కొంత భా గం లివర్ దానం చేయడంతో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు.

ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ మాట్లాడుతూ.. మార్ఫాన్ సిం డ్రోమ్, హెపటో-పల్మనరీ సిం డ్రోమ్ ఉన్న రోగికి లివర్ ట్రా న్స్‌ప్లాంటేషన్ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. మధుసూదన్ వైద్యబృందానికి అభినందనలు తెలిపారు.