calender_icon.png 27 November, 2024 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంలో అరుదైన శస్త్ర చికిత్స

27-11-2024 04:38:49 AM

మెదడులో ఏర్పడ్డ కణతి తొలగింపు 

ఖమ్మం, నవంబర్ 26 (విజయక్రాంతి): ఖమ్మంలోని మమత జనరల్ ఆసుపత్రిలో మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన జీ వెంకయ్య(80) గత మూడేళ్లుగా తలనొప్పి, కళ్లు తిరగడం, తూలడం వంటి లక్షణాలతో ఇబ్బందిపడుతున్నాడు. సమస్య ఎక్కువ కావడంతో మమత ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు.

పరీక్షించిన వైద్యులు చిన్న మెదడు, పెద్ద మెదడుకు మధ్యలో బ్రెయిన్ స్టెమ్‌కు అతుక్కుని కణతి ఉన్నట్టు గుర్తించారు. న్యూరో విభాగం అధిపతి డాక్టర్ జగదీష్‌బాబు  ఆధ్వర్యంలో ఎంతో సంక్లిష్టమైన ఈ శస్త్ర చికిత్సను నిర్వహించి కణతిని తొలగించారు. దీంతో డాక్టర్ జగదీష్‌బాబును మమత మెడికల్ కాలేజీ, మమత ఆసుపత్రి కార్యదర్శి పువ్వాడ జయశ్రీ అభినందించారు. రూ.10 లక్షలకు పైగానే ఖర్చు అయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా నిర్వహించినట్టు తెలిపారు.