calender_icon.png 26 November, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

45 రోజుల శిశువుకు అరుదైన సర్జరీ

17-05-2024 01:52:57 AM

మెడికవర్ ఉమన్ అండ్ చైల్డ్ ఆసుపత్రి వైద్యుల ఘనత

హైదరాబాద్ సిటీబ్యూరో, మే16 (విజయక్రాంతి): మెడికవర్ ఉమన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో 45 రోజుల శిశువుకు అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు డాక్టర్ మధుమోహన్‌రెడ్డి తెలిపారు. ‘అట్రేసియా’ అనే అరుదైన వ్యాధికి విజయవంతంగా సర్జరీ చేసినట్లు వివరించారు. నాలుగు రోజలుగా పొత్తికడుపు వాపు, వాంతులతో బాధపడుతున్న ఓ 45 రోజుల పసికందుకు జననేం ద్రియ భాగంలో మూత్రాశయ సమస్య బయటపడ్డదని చెప్పారు. ఆ శిశువుకు మూ త్ర విసర్జన కోసం జననేంద్రియ భాగం లేద ని గ్రహించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆ పాప తల్లిదండ్రులకు వివరించి, గైనకాలజిస్ట్ డాక్టర్ వరలక్షి సహకారంతో 2.5సెం.మీ లో జననేంద్రియ(యోని) భాగం పునర్నిర్మించామన్నారు. ఆసుపత్రిలోని అత్యాధు నిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన డాక్టర్ల వల్లనే తమ పాపను కాపాడుకోగలిగామని తల్లిదండ్రులు చెప్పారు. కార్యక్రమంలో నియోనో టాలజీ, పీడియాట్రిక్స్ విభాగం అధిపతి డాక్టర్ రవీందర్‌రెడ్డి, వైద్యులు జనార్దన్‌రెడ్డి, అనస్థీషియాలజీ విభాగం డాక్టర్ సంధ్య, హర్షిత తదితరులు పాల్గొన్నారు.