calender_icon.png 1 November, 2024 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేర్‌లో అరుదైన శస్త్ర చికిత్స

20-04-2024 01:31:31 AM

l జన్యు లోపమున్న బాలునికి విజయవంతంగా కాలేయ మార్పిడి 

l తన కాలేయంలో కొంత భాగాన్ని కుమారునికి దానం చేసిన తల్లి

బంజారాహిల్స్ (హైదరాబాద్), ఏప్రిల్ 19: అత్యంత అరుదైన జన్యు లోపం కలిగిన బాలునికి కేర్ ఆసుపత్రి హెపటాలజీ (కాలేయ వ్యాధి నిపుణలు) వైద్య బృందం విజయవంతంగా శస్త్ర చికిత్స చేసింది. అలగిల్లీ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల వరుణ్‌కు కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసింది. అలగిల్లీ సిండ్రోమ్ లక్షమందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉం టుంది. ఈ అరుదైన స్థితిలో కాలేయం లోప ల బైల్ డక్ట్ (పిత్తనాళాలు) కెనాల్ సిస్టమ్ అభివృద్ధి చెందదు. దీనివల్ల కాలేయంతో పాటు రక్తంలో పిత్తరసం చేరుతుంది. ఈ కారణంగా కామెర్లు, తీవ్రమైన దురద వస్తాయి.

తదనంతర కాలంలో కాలేయం విఫలమవుతుంది. ఈ వ్యాధి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సోకే ప్రమాదం కూడా ఉంది. చిన్నారుల ఎదుగుదలపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా నక్షత్రాలను అన్వేషించాలని కల లు కన్న 12 ఏళ్ల బాలుడు వరుణ్, చిన్నప్పటి నుంచీ ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. నిరంతర కామెర్లు, ఎదుగుదల మందగించడం, తీవ్రమైన దురద, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందిని ఎదుర్కొనేవాడు. కేర్ ఆసుపత్రిలో వైద్య సాయంతో వరుణ్ తిరిగి తన విలువైన జీవితాన్ని పొందాడని లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ మహ్మద్ నయీ మ్ తెలిపారు. మొద ట వరుణ్ ఊపిరితిత్తుల ధమనిలో అడ్డంకిని పరిష్కరించడానికి మొదట్లో హార్ట్-స్టెంటింగ్ ప్రక్రియ కూడా జరిగిందని వెల్లడించారు.

తర్వాత వరుణ్‌కు ఉన్న వ్యాధిని గుర్తించామని, కాలేయ మార్పిడి చేయాలని సూచించామన్నారు. వరుణ్ తల్లి తన కాలేయంలో కొంత భాగా న్ని దానం చేయడానికి ముందు కొచ్చారని తెలిపారు. ‘అతి బలహీనమైన బాలుడికి క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయడం మా మల్టీ డిసిప్లీనరీ బృందం వల్ల సాధ్యమైందని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ అధికారి సయ్యద్ కమ్రాన్ పేర్కొన్నారు.