22-02-2025 12:11:25 AM
ఎస్‌ఎస్‌ఐ మంత్ర రోబోటిక్‌తో కణతి తొలగింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): నానక్‌రామ్‌గూడలోని కాంటి ఆస్పత్రిలో శుక్రవారం వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. పెద్ద పేగులో కణతి సమస్యతో బాధపడుతున్న ఓ 74 ఏండ్ల వృద్ధురాలి కడు కోయకుండానే ఎస్‌ఎస్‌ఐ మంత్ర రోబోటిక్‌తో కణతిని తొలగించారు.
నేచురల్ ఆరిఫైస్ స్పెసిమెన్ ఎక్స్‌ట్రాక్షన్(నోస్) ప్రక్రియ ద్వారా శస్త్రచికిత్సను పూర్తిచేశారు. రోగికి బీపీ ఉండడంతోపాటు, గతంలో హెస్టరెక్టమీ శస్త్ర చికిత్స జరిగింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని డాక్టర్ కౌశిక్‌రావు, డాక్టర్ మధుసూదన్‌రెడ్డి నోస్ ప్రక్రియను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్‌రావు మాట్లాడుతూ ఇలాంటి శస్త్ర చికిత్సలు మహిళలకు ప్రయోజనాన్ని అందించగలవన్నారు.
కలొరెక్టల్ క్యాన్సర్ చికిత్సలో ఈ రోబోటిక్ శస్త్రచికిత్స కీలక మైలురాయిగా నిలుస్తోందని చెప్పారు. అత్యంత నైపుణ్యంతో శస్త్రచికిత్స అందించిన వైద్య సిబ్బందిని కాంటింనెంటల్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్‌లో తాము కటింగ్‌ఎడ్జ్ చికిత్స అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వడంతో పాటు రోగులు త్వరగా కోలుకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.