04-04-2025 01:19:36 AM
మహిళ కడుపులో ఉన్న 7 కిలోల గర్భసంచి కణితి తొలగింపు
హుజూర్ నగర్ ఏప్రిల్ 3: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామానికి చెందిన సరోజన(42) అనే మహిళ గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడు తూ హుజూర్‌నగర్ పట్టణంలోని సాయిబాబా ధియేటర్ ఎదురుగా ఉన్న విష్ణు జనరల్ ల్యాప్రోస్కోపిక్ హాస్పటల్ కు బుధవారం చికిత్స నిమితం చేరింది. ఆమెకు డాక్టర్ అనంతు విష్ణువర్ధన్ గౌడ్ గురువారం వైద్య పరీక్షలు నిర్వహించి.. స్కానింగ్ చేయగా అండాశయం వద్ద 7 కిలోల కణితి ఉన్నట్లుగా గుర్తించారు.
ఈ క్రమంలో సదరు మహళకు హస్పటల్ లో అరుదైన శస్త్ర చికిత్స చేసి అండాశయం వద్ద ఉన్న 7 కిలోల కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య స్థితి బాగానే ఉన్నట్లుగా డాక్టర్ తెలిపారు