calender_icon.png 15 April, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్‌లో అరుదైన వృక్ష శిలాజాలు

13-04-2025 01:19:52 AM

నిర్మల్‌కు సమీపంగా ఉన్న అటవీ ప్రాంతంలో లావా రాతి స్తంభాలు ఉన్నట్టు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు గుర్తించారు. సహ్యాద్రి పర్వతాలుగా ప్రసిద్ధి చెందిన నిర్మల్ గుట్టలు వృక్ష, జీవ వైవిధ్యానికి ఎంతో పేరుగాంచినాయని, చారిత్రకంగా భవభూతి తన నాటకం ‘ఉత్తర రామ చరిత’ నిర్మల్ గుట్టల వర్ణన, గోదావరి వర్ణనలు చేశారని, నిర్మల్‌కు సమీపంగా ఉన్న అటవీ ప్రాంతంలో లావా రాతి స్తంభాలు ఉన్నాయని అన్నారు.

అంతేకాకుండా లక్షల సంవత్సరాల నాటి వృక్ష శిలాజాలు గుర్తించినట్లు తుమ్మల దేవరావు తెలిపారు. వృక్షాలు అటవీ ప్రాంతంలో నేలకూలి భౌతిక పరిస్థితుల వల్ల ఫాజిలైసేషన్ చెంది రాతి లాగా గట్టిపడి వృక్ష శిలాజాలుగా మారుతాయి. ఇలా మార్పు చెందడాన్ని ఫాజిలైసేషన్ అని అంటారు.