calender_icon.png 26 April, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మమత’లో అరుదైన ఆపరేషన్

25-04-2025 01:40:23 AM

మహిళ గర్భా శయం నుంచి 8.8 కిలోల గడ్డ తొలగింపు 

ఖమ్మం, ఏప్రిల్ 24 ( విజయక్రాంతి ):-ఖమ్మం లోని మమత అస్పత్రిలో గురువారం వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి, రోగి ప్రాణాలను కాపాడినట్లు వైద్యులు మీడియా సమావేశం లో వెల్లడించారు. సూర్యాపేట జిల్లా రంగాపురం గ్రామానికి చెందిన 75 ఏళ్ళ రోగి టి. సుశీల గర్భాశయ వ్యాధితో అస్పత్రిలో చేరింది. డాక్టర్లు పరీక్షలు చేసి ఆమె  గర్భ శయంలో 8.8.కిలోల బరువైన గడ్డ ఉందని తేల్చారు. రోగి ప్రాణానికి ఎటువంటి ఆపద లేకుండా డాక్టర్ నైమిష మొవ్వా వారి వైద్య బృందం నైపుణ్యం తో విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి, గడ్డను తొలగించారు.

ఈ శస్త్ర చికిత్స అద్భుతమైన బృంద సమన్వయం, శస్త్ర చికిత్స నైపుణ్యానికి నిదర్శనమని వైద్యులు వెల్లడించారు. ఈ శస్త్ర  చికిత్సను డాక్టర్ నైమిష మొవ్వా, డాక్టర్ ముద్రగడ ఇందు, డాక్టర్ హర్షిక, డాక్టర్ గీత, డాక్టర్ సుగ్గాల కిరణ్ కుమార్, డాక్టర్ కాటా శశాంక బృందం నిర్వహించింది.మీడియా సమావేశం లో మమత అస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పువ్వాడ నరేన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. అనురాధ, మెడికల్ సూపరింటెండెట్ బి. రామస్వామి, ఆర్ ఎం ఓ డాక్టర్ కె. సంతోష్ తదితరులు పాల్గొన్నారు.