దేశంలోనే మొదటిసారి 35ఎంఎం కృత్రిమ కవాటం అమెరిక
హైదరాబాద్ సిటీ బ్యూరో, (విజయక్రాంతి): పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చిన్నతనం నుండే టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ యువకుడికి అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేసినట్లు ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ తెలిపారు. శనివారం నిమ్స్ ఆస్పత్రి సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన బానోత్ అశోక్(23) అనే యువకుడికి చిన్నప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని చెప్పారు.
కొంతకాలంగా అతడు ఇబ్బందులు పడుతుండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రులకు తీసుకు వెళ్లడంతో దాదాపు 25 లక్షల వరకు ఖర్చవుతుందని లోని వైద్యులు తెలిపారు. దీంతో వారు నిమ్స్ ఆస్పత్రికి రావడంతో రూ. 10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రావడం, మరో ఐదు లక్షలు బాధితులు చెల్లించడంతో రూ. 15 లక్షలు కచ్చితంగా శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు చికిత్స జరిపి భవిష్యత్తులో పేషెంట్ కు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. దేశంలోనే మొదటిసారి 35ఎంఎం కృత్రిమ కవాటం అమర్చమన్నారు. ఈ సందర్భంగా పేషంట్ తల్లి బానోత్ సునీత మాట్లాడుతూ తన కుమారుడికి శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించిన నిమ్స్ వైద్యులు, ఆర్థికంగా సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నిమ్స్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.