- జైలుకు తరలిస్తుండగా తిరగబడిన నిందితుడు
- ఎదురుకాల్పుల్లో మృతి
ముంబై, సెప్టెంబర్ 23: మహారాష్ట్ర థాణే జిల్లా బద్లాపూర్‌లో పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. సోమవారం కేసు విచారణలో భాగంగా తలోజా జైలు నుంచి బద్లాపూర్‌కు తీసుకొస్తున్న సమయంలో పోలీసులపై నిందితుడు అక్షయ్ షిండే తిరగబడ్డాడు. ఓ అధికారి నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.