- గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గుతున్న టెంపరేచర్
- సిర్పూర్‌లో అత్యల్పంగా 10 డిగ్రీలు నమోదు
- చలికి వణికిపోతున్న ప్రజలు
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో వాతావ రణం వేగంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నా యి. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, జిల్లాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్ తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆయా జిల్లాల్లో చలి పంజా విసురుతోంది.
2023 నవంబర్ 23న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15.9 డిగ్రీలు నమోదు కాగా.. శనివారం రికార్డు స్థాయిలో ఏకంగా 10 డిగ్రీలకు పడిపోయా యి. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌లో గతేడాది 15.7 డిగ్రీలు నమో దు కాగా.. ఈసారి 10.3 డిగ్రీలకు తగ్గాయి.
అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండలో కనిష్ఠ ఉష్ణోగ్రత గతేడాది 16.2 డిగ్రీలు ఉండగా.. ఈసారి 10.8 డిగ్రీలకు పడిపోవడం గమనార్హం. ఇలా ప్రతి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గతేడాదితో పోలిస్తే ఐదు డిగ్రీలు తగ్గుతు న్నాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతూ సాయంత్రం నుంచే ఇళ్లకు పరిమితం అవుతున్న పరిస్థితి నెలకొంది.