calender_icon.png 19 April, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాపిడ్ ,ఓలా, ఉబర్, ప్రైవేట్ సంస్థలను రద్దు చేయాలి: జమలయ్య

09-04-2025 01:26:20 AM

ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నా...

కొత్తగూడెం,ఏప్రిల్ 8 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో రాపిడో, ఓలా, ఉబర్ ప్రైవేటు సంస్థలను తక్షణమే రద్దు చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం ఆటో వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో ఆఫీస్ ఎ దుట ధర్నా  చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కొత్తగూడెం పట్టణం సుమారు, నాలుగు కిలోమీటర్ల వైశాల్యం గల పట్టణంలో  రాపిడ్ ,ఓలా, ఉబర్ ప్రైవేటు సంస్థలు సేవలు అవసరం లేదన్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  మహిళా సోదరీమణులకు, మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు ఏర్పాటు చేయటం వలన, ఇప్పటికే ఆటో మోటర్ రంగం దయ నీయ  పరిస్థితిలోకి మెట్టబడిందని, నిరుద్యోగ యువత, ఉద్యోగాలు లేక ఆటో వృత్తిపై జీవనధారంగా చేసుకొని, ప్రభుత్వంపై ఆధారపడకుండా, కుటుంబాలను  పోషించుకొంటున్న తరు ణంలో కొత్తగూడెం పట్టణంలో,

ఆటో డ్రైవర్లకు కొరకరాని  కొయ్యగా రాపిడ్ ఓలా, ఊబర్ లు తయారయ్యాయని, వాటిని రద్దుచేసి ఆటో డ్రైవర్లని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశా రు.అనంతరం పలు డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ, అబ్బులు,  కృష్ణ, అమిదు, లక్ష్మణ్ ,భాష ,భాస్కర్, కోటి, రామరాజు,  పట్టణంలో 14 అడ్డాల అధ్యక్ష కార్యదర్శులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు..