calender_icon.png 6 March, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు కవాతు నిర్వహించిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్

06-03-2025 08:43:07 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గురువారం పోలీస్ స్టేషన్ నుండి జెండా గల్లి, బండగల్లి, ప్రధాన రహదారి గుండా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు పట్టణంలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎఎఫ్డి ఎస్పీ బగేల్ మాట్లాడుతూ... ప్రజలకు తాము ఉన్నామని నమ్మకంతో కవాతు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ పాల్గొన్నారు.