calender_icon.png 6 October, 2024 | 4:12 AM

90 అత్యాచారాలు.. 42 యావజ్జీవ శిక్షలు

06-10-2024 01:27:27 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దక్షిణాఫ్రికాలో ఓ కరుడుగట్టిన రేపిస్టుకు కోర్టు ఏకంగా 42 యావజ్జీవ శిక్షలు విధించింది. జొహెన్నస్‌బర్గ్ సమీపంలోని ఎకుర్‌హులెని ప్రాంతంలో 2012 మధ్య 9 ఏండ్ల వ్యవధిలో ఫకతి అనే వ్యక్తి ఏకంగా 90 మందిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఎక్కువగా పాఠశాల విద్యార్థినులే ఉన్నారు. 2021 లో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని 90 కేసులో జొహెన్సెస్‌బర్గ్ హైకోర్టు దోషిగా తేల్చింది. ఇందులో 42 కేసుల్లో అతడికి యావజ్జీవ శిక్షలు విధించింది. కోర్టు తీర్పు చెప్తున్న సమయంలో ఫకతి కోర్టులోనే ఉన్నాడు.