calender_icon.png 18 November, 2024 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 పైసలకే రేప్ వీడియో!

02-09-2024 12:27:12 AM

  1. ఆన్‌లైన్‌లో అమ్మకానికి అశ్లీల వీడియోలు
  2. అత్యాచార ఘటనలపై నిరసనలు జరుగుతుండగా..
  3. మరోవైపు రేప్ వీడియోలకోసం వెతుకులాట
  4. టెలిగ్రామ్ వంటి యాప్‌లతో మరింత సులభంగా యాక్సెస్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: కోల్‌కతా వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. గతంలో నిర్భయ ఘటనపైనా ఇదే తరహా ఆందోళనలు సాగాయి. దేశంలో మహిళలు, చిన్నారులపై నేరాలు సంచలనాత్మకంగా మారినప్పుడు ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి న్యాయం కోసం పోరాడిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం. కానీ నాణేనికి మరోవైపు రెండో కోణం కూడా ఉంది.

కొన్ని వెబ్‌సైట్లు ముఖ్యంగా టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో రేప్ వీడియోలు తక్కువ ధరకే లభిస్తాయనే ప్రకటనలు కనిపిస్తున్నాయి. రేప్ వీడియోలు, చైల్డ్ పోర్న్, బలవంతపు లైంగిక దాడులకు సంబంధించిన వీడియో కంటెంట్ అమ్మకానికి ఉంది. ఇలాంటి సున్నితమైన కంటెంట్ పెద్దమొత్తంలో అమ్ముడవుతుండటం కొసమెరుపు. ఇది మన సమాజంలోని ద్వంద్వ ధోరణిని బహిర్గతం చేస్తోంది.

ఏదైనా భయంకరమైన అత్యాతారం కేసు నమోదైతే దేశంలోని చాలామంది హృదయాన్ని కలిచివేస్తుంది. బాధితురాలికి న్యాయం జరగాలని చాలామంది రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేపడుతారు. ప్రభుత్వ వైఖరిపై దుమ్మె త్తిపోస్తారు. కానీ మరోవైపు ఆ కేసుకు సంబంధించిన లైంగిక వేధింపుల వీడియోల కోసం వెతుకులాట అదేస్థాయిలో ఉంటుంది. నిరసనలు బయటికి కనిపించినా.. ఆ వీడియోల వెతుకులాటకు సంబంధించిన వివరాలు మాత్రం పెద్దగా బయటికి రావు. 

ఇంటర్నెట్‌తో సులభంగా..

అత్యాచారాల వీడియోల విక్రయం కొత్తేమీ కాదని అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ వీడియోలను సీడీలు, పెన్‌డ్రైవ్‌ల రూపంలో విక్రయించేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ వాడకం విస్తృతంగా పెరగడంతో ఎన్‌క్రి ప్టెడ్ యాప్‌ల్లో ఇందుకు సంబంధించిన వీడియోలు విరివిగా దొరుకుతున్నాయి. ఇంట ర్నెట్ కారణంగా ఈ వీడియోలను సులభంగా యాక్సెస్ చేస్తున్నారని విరవించారు. ఇంతకుముందు ఇలాంటి వీడియోలు డార్క్‌వెబ్‌లో ఉండేవి. ప్రత్యేక బ్రౌజర్ సాయంతో బిట్‌కాయిన్ వంటి ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గా లతో యాక్సెస్ లభించేవి. ఇప్పుడు టెలిగ్రామ్, ఇతర ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లతో అలాంటి వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి. క్రెడి ట్ కార్డులు, పేపాల్, యూపీఐ వంటి ఆన్‌లైన్ పద్ధతుల్లో చెల్లింపులను అంగీకరిం చడంతో ఈ వీడియోల వాణిజ్యం ఇప్పుడు సరళంగా మారిందని అధికారులు చెబుతున్నారు. 

గూగుల్ ట్రెండ్స్ ప్రకారం..

ఇక్కడే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి సంచనాలనాత్మక అత్యాచారం కేసులో వీడియోల కోసం వెతుకులాట ఎందుకు జరుగుతోంది? వీటిని ఎందుకు తీస్తున్నారు? ఆన్‌లైన్‌లో ఎందుకు ఉంచుతున్నారు? వీటికి ఇంత భారీ డిమాండ్ ఎందుకుంది? అత్యాచారం కేసు హైలైట్ అయినప్పుడల్లా దాని గురించి సమాచారాన్ని వెతకాలనే ఆసక్తి ఉంటుంది. కానీ ఈ శోధనల్లో చీకటి కోణం కూడా ఉంది. గూగుల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన రేప్ వీడియోల కోసం సెర్చ్ చేసే వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా వైద్య విద్యార్థిని ఘటన, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు, మణిపూర్ మహిళల వీడియోల కోసం ఎక్కువ శోధనలు జరిగినట్లు గూగుల్ ట్రెండ్స్ స్పష్టం చేసింది. 

ఎవరు తీస్తున్నారు? 

బాధితులను బెదిరించే ప్రయత్నంలో నేరస్థులు వీడియోలను చిత్రీకరిస్తారని ఓ సీని యర్ అధికారి వెల్లడించారు. బాధితులను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తారు. ఈ క్రమంలో ఆ వీడియోలను సన్నిహితులకు పంపడంతో అవి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఆపై డోరిమాన్ లాంటి సంస్థలకు చేరుతాయి. ఢిల్లీలోని నీడపాలికా బజార్, లక్నోలోని హజ్రత్‌గంజ్ మార్కెట్లు ఇలాంటి వ్యాపారాలకు కేంద్రంగా ఉన్నాయి. దేశంలో సెక్స్ పట్ల సరైన అవగాహన లేకపోవడం ఇలాంటి వీడియోలకు ఆకర్షితుల య్యేందుకు ప్రధాన కారణమని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్‌లో మాత్రమే కాదు..

ఆర్జీకర్ విద్యార్థిని అత్యాచారం విషయం బయటికి వచ్చిన సమయంలోనూ దాడికి సంబంధించిన వీడియో కోసం విస్తృతంగా వెతికినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్‌లోని అనేక గ్రూపుల్లో బాధితురాలి పేరు, ఫొటోలతో పాటు రేప్ అనే పదం ద్వారా సెర్చ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజ్వల్ రేవణ్ణ, మణిపూర్ ఘటనల్లోనూ ఆయా కీవర్డ్స్ విస్తృతంగా వినియోగించినట్లు గూగుల్ ట్రెండ్స్ వివరించింది. ఇలాంటి కంటె ంట్ సెర్చ్‌లో కేవలం భారత్ మాత్ర మే పరిమితం కాలేదు.

నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ వినియోగదారులు సైతం చూస్తున్నట్లు ట్రెండ్స్ వివరిస్తున్నాయి. అంతే కాదు సోషల్ మీడియాల్లో ఘటనలకు సంబంధించి ప్రత్యేక గ్రూపుల ను సైతం క్రియేట్ చేస్తున్నారు. క్యాటగిరీల వారిగా వేలాది వీడియోలు అందిస్తారు. అందుకు తగిన రేట్లను నిర్ణయిస్తారు. డోరిమాన్ అనేక విక్రేత 99 రూపాయలకే తన వద్ద 820కిపైగా రేప్ వీడియోలు ఉన్నట్లు ఓ వార్తాసంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో తెలిపాడు. అంటే 12 పైసలకు ఓ వీడియో ఇస్తున్నాడన్నమాట.