సికింద్రాబాద్: ప్రేమ పేరుతో యువతిని నమ్మించి అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన యువతికి స్వామి అనే వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. కొంతకాలంగా ఫేస్ బుక్ లోనే స్వామి యువతితో మాట్లాడుతూ ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తను కొద్ది రోజుల్లో ఆస్టేలియా వెళ్తున్నానని యువతిని హైదరాబాద్ కు రప్పించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారం చేశాడు. యువతి పెళ్లి చేసుకోవాలని అడగటంతో స్వామి ముఖం చాటేస్తూ.. ఆస్ట్రేలియా వేళ్లేందుకు యత్నిస్తున్నాడు. దీంతో స్వామి ప్రవర్తనలో అనుమానం రావడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవాళ విమానాశ్రయంలో స్వామిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.