calender_icon.png 5 March, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ బాలికపై అత్యాచారం...

05-03-2025 12:09:35 AM

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుతో పాటు జరిమానా..

కాటారం (భూపాలపల్లి) (విజయక్రాంతి): మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష తో పాటు 25 వేల రూపాయల జరిమానా విధించిన భూపాలపల్లి జిల్లా కోర్టు. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహ ముత్తారం మండలం కనుకునూరు గ్రామానికి చెందిన అట్టెం మల్లయ్య  (46) అనే వ్యక్తి 2019 వ సంవత్సరంలో మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసినందుకు గాను అతనిపై అత్యాచారంతో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా ఉన్న ఎస్సై బి రాము కేసు నమోదు చేయగా... అప్పటి కాటారం సిఐ శివప్రసాద్ నిందితున్ని అరెస్ట్ చేయాగా, ఆ తర్వాత సీఐ హథిరాం మరి కొంతమంది సాక్షులను విచారించారు. 

అప్పుటి కాటారం డిఎస్పీ గా ఉన్న, ప్రస్తుత భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్  కోర్టులో చార్జీ షీట్ ఫైల్ చేశారు  కేసు విచారణలో నిందితుడు అట్టెం మల్లయ్య పై నేరం రుజువు అయినందున భూపాలపల్లి జిల్లా కోర్టు న్యాయమూర్తి పి నారాయణబాబు నిందితుడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 25 వేల రూపాయలు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో జిల్లా కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్  విష్ణువర్ధన్ రావు వాదనలు వినిపించగా.. కోర్టు లైసనింగ్ ఆఫీసర్, ఏ ఎస్ ఐ వెంకన్న ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ కే రమేష్ సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టారు.

నిందితుడికి శిక్ష విధించడంలో సమర్థవంతంగా పనిచేసిన అప్పటి దర్యాప్తు అధికారిని, కేసు ట్రయల్ లో  భాగంగా సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టడానికి కృషి చేసిన ప్రస్తుత కాటారం డి.ఎస్.పి గడ్డం రామ్మోహన్ రెడ్డి ని, కాటారం సర్కిల్  ఇన్స్ పెక్టర్ ఈవూరి నాగార్జున రావును,  అడవి ముత్తారం ఎస్ ఐ పీ.మహేందర్ కుమార్ లను, పి పి, కోర్టు  లైజనిoగ్ ఆఫీసర్, కోర్టు పిసి లను ఈ సందర్భంగా భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే  అభినందించారు.