- బెంగాల్‌లో జూడా లైంగిక దాడి కేసులో హైకోర్టు నిర్ణయం
- 10 గంటల్లో కేసు వివరాలను సమర్పించాలని సిట్‌కు ఆదేశం
- పోస్టుమార్టం నివేదికలో వెలుగులోకి విస్తుపోయే అంశాలు
కోల్‌కతా, ఆగస్టు 13: పశ్చిమ బెంగాల్‌లో పీజీ వైద్యురాలి అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు జరిగిన విచా రణ, అందుకు సంబంధించిన ఆధారాలను వెంటనే సీబీఐకి ౩ వారాల్లో అందజేయాలని సిట్‌ను ఆదేశించింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
లైంగికదాడి తర్వాత నిందితుడు ఆమె గొంతు నులిమాడాని, ఆమె కేకలు వేయకుండా తలను గోడకు అదిమిపట్టి ముక్కు, నోరు మూసివేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. పెనుగులాటలో ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయిందని, పాశవిక దాడి కారణంగా అంతర్గత అవయవాలకు తీవ్ర గాయా లయ్యాయని నివేదిక నిర్ధారించింది. కానీ ఆమె కళ్లకు ఎందుకు గాయాలయ్యాయి? అనే విష యం శవపరీక్షలో నిర్ధారణ కాలేదు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే సంజయ్‌రాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మహత్య అంటూ ఫోన్
జూడా హత్య జరిగిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నదని కుటు ంబసభ్యులకు ఫోన్ వెళ్లినట్లు తెలిసింది. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆ కాల్ చేసినట్లు సమాచారం. ఆత్మహత్యగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం సీఎం మమతా బెనర్జీ మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఉద్ధృతంగా ఆందోళనలు
జూడాపై అత్యాచార ఘటనపై ‘ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్’ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. జూడాలు రోడ్లపైకి వచ్చి ‘నో సెఫ్టీ నో వర్క్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి వినూత్న నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ‘స్వాతంత్య్రం వచ్చిన నిశిధిలో మహిళ స్వేచ్ఛ కోసం’ అనే పేరిట నిరసన తెలపనున్నారు. ఈ కార్యక్రమానికి సోషల్ మీడియాలో సినీతారలతో పాటు సాధారణ ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తున్నది.
పోలీసులు, ప్రభుత్వానికి హైకోర్టు మందలింపు
బెంగాల్ ప్రభుత్వాన్ని రేప్ కేసు కుదిపేస్తున్న వేళ.. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ మార్పుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తచేసింది. డాక్టర్ సందీప్‌ఘోష్ రాజీనామా చేసిన కొద్ది గంటలకే మరొకరిని ఎలా నియమిస్తారని మండిపడింది. నిందితుడికి పోలీసులతో సంబ ంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసును స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు కోరడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ కేసుపై పూర్తి నివేదిక ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ మంగళవారం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది. నివేదికను పరిశీలించిన తర్వాత బాధ్యులపై క్రమశిక్షక్షణ చర్యలు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.