- కర్ణాటక ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు
- రెండేండ్లుగా లైంగికదాడి చేస్తున్నట్టు ఆరోపణ
బెంగళూరు, సెప్టెంబర్ 19: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్ననాయుడు తనపై రెండేండ్లుగా లైంగికదాడి చేస్తున్నాడని ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తనను ఎరగా వేసి ఓ కార్పొరేటర్ భర్తను కూడా వేధించాడని ఆరోపించింది. తనపై లైంగికదాడి చేసి మునిరత్న వీడియో చిత్రీకరించాడని, వాటిని అడ్డు పెట్టుకొని ఆయన అంగరక్షకుడు మరో ఐదుగురు తనను తీవ్ర వేధింపులకు గురిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కగ్గలిపుర పోలీస్‌స్టేషన్‌లో మునిరత్న నాయుడిపై కేసు నమోదైంది. ఈ కేసులో గత వారం వ్యాలికలవల్ పోలీస్‌స్టేషన్‌లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఓ కార్పొరేటర్ అట్రాసిటీ కేసు నమోదుచేయగా, తనను ఎమ్మెల్యే రూ.30 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్టు బీబీఎంపీ కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయ టంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అట్రాసిటీ కేసు లో అరెస్టయిన ఆయన ప్రస్తుతం బెంగళూరు జైలులో జ్యుడీషియల్ ఖైదీగా ఉన్నారు.