calender_icon.png 30 March, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాపర్తి రవీందర్

27-03-2025 04:35:01 PM

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాపర్తి రవీందర్ ఎన్నికయ్యారు. గురువారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో బోనగిరి సతీష్ బాబుపై రవీందర్ గెలుపొందారు. వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా గెలుపొందడంతో పలువురు న్యాయవాదులు అభినందించారు.

దీంతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా చంద్రకుమార్, ప్రధాన కార్యదర్శిగా చరణ్, సంయుక్త కార్యదర్శిగా నగేష్, కోశాధికారిగా రామకృష్ణ, గ్రంథాలయ కార్యదర్శిగా కుమారం లాల్షా, మహిళ ప్రతినిధులుగా గాయత్రి, మధురిమ, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా కిషోర్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఎన్నికల పర్యవేక్షకులుగా పిసి జైన్, నికోడే రవీందర్ వ్యవహరించారు.