23-04-2025 12:47:10 AM
వనపర్తి ఏప్రిల్ 22 ( విజయక్రాంతి ) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వనపర్తి జిల్లా రావుస్ కళాశాల ప్రభంజనం చాటుకుంది. వనపర్తి జిల్లాకు చెందిన రావుస్ కళాశాల విద్యార్థులు మంచి క్రమశిక్షణ ప్రతిభను కనబరిచి రాష్ట్రంలోనే ఉత్తమ మార్కులు సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి ఎంపీసీ చెందిన విద్యార్థులు సంతోష్ నాయుడు మార్కులు 468, 467 మార్కులు ఎం అక్షయ, రైన్షా బేగం, 466 మార్కులు ఎం హర్షిత శ్రీ, ఏ రాకేష్, బైపిసి విభాగం లో 435 మార్కులు టి.రాధా, కె దేవిక, 434 మార్కులు బి గోవిందం, 433 మార్కులు గీతాంజలి, సిఇసి విభాగం లో 483 మార్కులు ఎండి షారుక్ ఖాన్, ఎం ఇ సి విభాగం లో 487 మార్కులు ఐషా బేగం, 484 మార్కులు కీర్తన,ద్వితీయ సంవత్సరం బైపిసి విభాగం లో 990 మార్కులు వై .మనీషా, సీఈసీ విభాగం లో 929 మార్కులు మూల రాళ్ల రవి, ఎంఎసి విభాగం లో 910 మార్కులు గుర్రాల నందిని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పలువురి తో అభినందనలు పొందారు కళాశాల ప్రిన్సిపాల్ యాజమాన్యం ఈ రామ్ కుమార్ శ్రీనివాసులు శ్రీనివాస్ అమరేందర్ రెడ్డి రమేష్ రెడ్డి అధ్యాపకు బృందం విద్యార్థులను అభినందనలు తెలియజేశారు.