27-03-2025 11:51:48 PM
స్మగ్లింగ్ కేసులో మరో నిందితుడి అరెస్ట్..
బెంగళూరు: బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి, ఏ1 నిందితురాలు రన్యారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆమె డీఆర్‌ఐ కస్టడీలో ఉంది. సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు డీఆర్‌ఐ అధికారులు ఈ కేసులో గోల్డ్ డీలర్ సాహిల్ జైన్‌ను ఏ3 నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు. సాహిల్ జైన్, రన్యారావు కలిసి స్మగ్లింగ్ డీలింగ్ చేసేవారని, బంగారం రవాణా వ్యూహాన్ని సాహిల్ జైన్ చూసుకునేవాడని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఏ2 నిందితుడు తరుణ్‌రాజ్ కూడా అరెస్టయిన విషయం తెలిసిందే.