calender_icon.png 13 March, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటిన ఉపాధ్యాయుడు

12-03-2025 10:15:46 PM

చేగుంట,(విజయక్రాంతి): టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్స్ ఫలితాల్లో చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన అల్లి విజయ సేన రెడ్డి రాష్ట్ర స్థాయిలో 259 ర్యాంకుతో సత్తా చాటారు. ప్రస్తుతం చేగుంట మండల కేంద్రంలోని మక్కారాజపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అతను గ్రూప్స్ కు ఎంపిక కావడం పట్ల మండల ప్రజలు, కుటుంబీకులు అభినందనలు తెలిపారు. తాను మాట్లాడుతూ...  నిరంతరం, శ్రమ, కృషి, కుటుంబ ప్రోత్సాహంతోనే విజయం సాధించగలిగానని అన్నారు, గ్రూప్ 2  ఉపాధ్యాయుడి ఎంపిక పట్ల పిఆర్టియు మండల అధ్యక్షుడు గజగట్ల నాగరాజు, ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, రాజశేఖర్ పలువురు అభినందనలు తెలిపారు.