- డ్రగ్‌లో ‘ఎన్‌ఎండీఏ’ అవశేషాల గుర్తింపు
- క్యాన్సర్‌కు కారణమవుతాయని డబ్ల్యూహెచ్‌వో ప్రకటన
- ముప్పు నివారణపై సీడీఎస్‌సీవో అధ్యయనం
న్యూఢిల్లీ, జనవరి ౧: అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఆస్టేలియన్ ప్రభుత్వాలు అధికారికంగా నిషేధించిన ‘రానిటిడిన్’ అనే డ్రగ్ భారత్‌లో విస్తృతంగా అమ్ముడవుతున్నది. యాంటీ బయోటిక్ మాత్ర వేసుకున్నప్పుడు కడుపులో మంట రాకుండా ఉండేందు కు వైద్యులు ఈ డ్రగ్‌ను సిఫార్సు చేస్తారు. అలాగే రిఫ్లక్స్ వ్యాధి చికిత్సకూ వినియోగిస్తారు.
భారత్‌లో డ్రగ్ ఎకిలాక్, రాన్‌టాక్, జింటాక్ అనే పేర్లతో చలామణిలో ఉంది. ఒక్కో మాత్ర జనరిక్ ఔషధ ఔట్‌లె ట్‌లో రూ.6కే లభిస్తున్నది. విదేశాల్లో బ్యాన్ అయిన ఈ డ్రగ్ భారతదేశ వ్యాప్తంగా అమ్ముడవుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
సెంటర్ ఫర్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) ఇటీవల రానిటిడిన్‌లో హానికారక ఎన్ నైట్రో సోడిమెథైలమైన్ (ఎన్‌డీఎంఏ) అనే రసాయన అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించింది. సంస్థ ఆ రసాయనంతో మానవాళికి జరుగుతున్న హానిపై సమగ్ర అధ్యయనం చేస్తున్నది. మాత్రతో సైడ్ ఎఫెక్ట్స్‌ను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంస్థ మూడు వారాల క్రితం రాజ్యసభకు తెలిపింది.
1981లో గ్లాక్సో హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ రానిటిడిన్ డ్రగ్ ఉత్పత్తిని ప్రారంభించింది. క్రమంగా కంపెనీ 31 దేశాలకు డ్రగ్‌ను సప్లు చేసింది. ఇదే క్రమంలో 1983లో అమెరికాలో డ్రగ్ వినియోగం ప్రారంభమైంది. రానిటిడిన్ అక్కడ ‘జన్‌టా క్’గా చలామణి అయింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డ్రగ్‌లో ఎన్‌ఎండీఏ అవశేషాలు ఉన్నాయని, దీని కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రకటించిన తర్వాత అమెరికా, ఆస్ట్రేలియన్ ప్రభుత్వాలు డ్రగ్‌ను బ్యాన్ చేశాయి.